అద్భుత విజయం! కనీ వినీ ఎరుగని స్థాయిలో సిలికానాంధ్ర 3వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం! 8 వ గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన సిలికానాంధ్ర. మహాబృంద నాట్యంలో పాల్గొన్న 5794 మంది కూచిపూడి కళాకారులు.

SiliconAndhra has once again taken the initiative to present the renowned Kuchipudi Classical Dance form of Andhra Pradesh to the International Audience.

On December 23rd, 24th and 25th 2012, Kuchipudi Dancers from all over the world congregated at the G.M.C. Balayogi Stadium in Gachibowli and presented a scintillating and mesmerizing dance performance. It appeared as though the celestial dances from the heavens had descended down to earth to make the event memorable and unforgettable. The event was watched by thousands of people present in the stadium and was also telecast live for the benefit of many more who could not be present at the stadium.

SiliconAndhra intends to recreate this magical moment by organizing the 4th International Kuchipudi Dance Convention on December 26th, 27th and 28th 2014. SiliconAndhra invites accomplished and enthusiastic dancers of this great art form to come forward and spread awareness of this graceful dance all over the world.

The Convention, which is to be held in Hyderabad, will include interactive sessions where technical aspects of the dance form will be discussed, dance performances by the dancers of various participating countries will showcase their talent and finally, the highlight of the conference will be a grand group recital in which thousands of dancers from all over the world will dance to a few selected pieces. A video has been prepared which contains all the dance pieces which will be performed on the final Day is now available online. The dancers, with the help of their respective teachers will have to learn the dance pieces, practice and perform as per the instructions given in the video.

More than 10,000 dancers from different parts of Andhra Pradesh, other states within India, the US, Canada, UK, Russia, Dubai, Mauritius, Malaysia and Singapore and a few other countries will be participating in this mega event.

All those delegates desirous of participating in this Convention are requested to register their names.

భారతీయ నాట్య జగత్తులో అద్వితీయ స్థానాన్ని అలంకరించిన కూచిపూడి నాట్యానికి మరోసారి విశ్వవేదికపై పట్టంగట్టేందుకు సిలికానాంధ్ర సన్నాహాలు ప్రారంభించింది. 2012 డిసెంబర్ 23, 24, 25తేదీల్లో హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలీలోజి.ఎం.సి.బాలయోగి స్టేడియం మైదానంలో ఏకకాలంలో వేలాదిమంది నర్తకీ నర్తకులు ప్రదర్శించిన మహాబృంద నాట్య దృశ్యం అత్యంత రమణీయమై, చిరస్మరణీయమై మెరిసింది. దేవతలు నాట్యమాడిన పవిత్ర స్థలమన్నంతగా ఆ మైదానం చరిత్రకెక్కింది. ప్రత్యక్షంగా కొన్ని వేలమంది, ప్రసార మాధ్యమాల ద్వారా కోట్లాది మంది ఆ అపూర్వ సన్నివేశాన్ని తిలకించారు.

ఆ ఘన చరిత్రను పునరావృతం చేస్తూ 2014 డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో సిలికానాంధ్ర నిర్వహించనున్న నాల్గవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి సంసిద్ధులు కావాలని సిలికానాంధ్ర ప్రముఖ వర్ధమాన, ఔత్సాహిక కూచిపూడి నర్తకీనర్తకులను కోరుతున్నది. తెలుగువారు గర్వించదగిన కూచిపూడి నాట్యకళా చైతన్యాన్ని దశదిశలకూ వ్యాపింపచేద్దాం రండి!

హైదరాబాద్ మహానగర రంగస్థలిపై ఆ మూడు రోజుల్లో నాట్యకళాపరిణామాన్ని విశ్లేషిస్తూ సాగే అభినయ ప్రధానమైన ప్రసంగాలు, దేశవిదేశాల నుంచి వచ్చే నర్తకీనర్తకులు చేసే అద్భుత ప్రదర్శనలు, వేలాదిమంది నాట్యకళామతల్లికి సమర్పించే మహాబృంద నాట్య నీరాజనం ప్రధానాంశాలుగా ఉంటాయి. మహాబృందనాట్యంలో ప్రదర్శించబోయే అంశాలను కూచిపూడి భాగవతులు నర్తించగా చిత్రీకరించిన వీడియో సిద్ధంగా ఉంది. వీడియో చూస్తూ గురువు సహాయంతో అభ్యసించవలసి ఉంటుంది. మహాబృంద నాట్యంలో ఈ అంశాలనే ప్రదర్శించవలసి ఉంటుంది.

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, అమెరికా, కెనడా, యు.కె., రష్యా, ఆస్ట్రేలియా, దుబాయి, మారిషస్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచీ 10,000లకు పైగా ప్రతినిధులు ఈ నాట్యసమ్మేళనంలో పాల్గొంటున్నారు. నాట్య సమ్మేళనంలో పాల్గొనే వారంతా వెంటనే తమ పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం.